News

మంత్రులంతా డమ్మీలుగా మారారు:నాగం


తెలంగాణలో రేపటి నుంచి చేపట్టనున్న రైతు భరోసా యాత్రకు సంబంధించిన విషయాలను బీజేపీ నేత నాగం జనార్దన్‌రెడ్డి మీడియాకు మంగళవారం  వివరించారు. తెలంగాణ మంత్రులు మూగ జీవాలతో సమానమని సంచలన వ్యాఖ్యలు చేశారు టీఆర్ఎస్ ప్రభుత్వంలోని మంత్రులంతా డమ్మీలుగా మారారని చెప్పారు. ప్రశ్నిస్తే జైల్లో పెడతామని మంత్రి తలసాని చెప్పడం సిగ్గుచేటని నాగం అన్నారు. దమ్ముంటే తనను జైల్లో పెట్టాలని సవాల్ చేశారు. మంత్రులు ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని నాగం హెచ్చరించారు. కేసీఆర్‌ను చూస్తే తెలంగాణ ప్రజలకు సిగ్గనిపిస్తోందని నాగం జనార్దన్ విమర్శించారు. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాలనపై దృష్టి కేంద్రీకరిస్తే తెలంగాణ సీఎం మాత్రం పాలనను గాలికొదిలేశారని ఆయన ఆరోపించారు.